జాతకం

ధనస్సు
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఈ మాసం కొంతమేరకు అనుకూలం. లావాదేవీలు కొలిక్కివస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు అధికం. వాహనం, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వాయిదా పడుతూ వస్తున్న పసులు ఎట్టకేలకు పూర్తికాగలవు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పరిచయస్తుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. అనవసర విషయాలు జోలికి పోవద్దు. ప్రముఖులను కలుసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యంలో పాల్గొంటారు. కానుకలిచ్చిపుచ్చుకుంటారు.