జాతకం

ధనస్సు
ధనర్‌రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ధనలాభం ఉంది. మీ కష్టం వృధాకదు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరం. అవివాహితుల ఆలోచనులు పలు విధాలుగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.