జాతకం

ధనస్సు
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. అనవసర జోక్యం తగదు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. పట్టుదలకు పోవద్దు. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.