జాతకం

ధనస్సు
ధనుర్ రాశి : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ప్రతికూలతలు అధికం. ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. చేతిలో ధనం నిలువదు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. చీటికిమాటికి అసహనం పెరుగుతుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దంపతుల మధ్య అవగాహనా లోపం. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆప్తుల సలహా పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.