మీరు చవితి బుధవారం ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. మీకు షష్టమ శనిదోషం ఉన్నందువల్ల సంతానం కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. మీరు రాఘవేంద్ర స్వామికి 21 గురువారాలు, ప్రతి గురువారం 11 సార్లు ప్రదక్షిణ చేసిన మీకు శుభం, జయం, సంతానప్రాప్తి కలుగుతుంది.
మీ భార్య షష్టి శుక్రవారం రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరం సెప్టెంబరు వరకూ అర్ధాష్టమ శనిదోషం, గురుఛండాల దోషం ఉన్నందువల్ల మానసిక ఆందోళన, ప్రశాంతతలోపం వంటివి ఎదుర్కొంటారు. రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం వల్ల శుభం, జయం కలుగుతుంది.