ఖాదీరుల్లా-కమలపురం: మీరు చవితి గురువారం మిథునలగ్నం, ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి నందు జన్మించారు. మీరు మంచి పట్టుదలతో అనుకున్నది సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల పట్ల ఆశాప్రియులు, ఎదుటివారి ఆలోచనలను గ్రహించి ఎత్తుకు పైఎత్తు వేసి జయం పొందగలుగుతారు.
ప్రతిరోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల మీ సంకల్పం నెరవేరుతుంది. స్టార్ రూబీ అనే రాయిని 7 క్యారెట్లు ధరించిన సంకల్పం సిద్ధిస్తుంది. 2001 నుంచి రాహుమహర్దశ ఆరంభమైంది. ఈ రాహువు 2016 నుంచి 2019 వరకూ 50 శాతం యోగాన్ని ఇస్తుంది. ఇందు మీరు సామాన్యమైన యోగాన్ని పొందగలుగుతారు. 2019 నుంచి గురు మహర్దశ 16 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని పొందుతారు. ఏదైనా దేవాలయంలో తెల్లజిల్లేడు చెట్టును నాటిని శుభం కలుగుతుంది.