చెన్నకేశవరావు-గుంటూరు: మీరు ద్వాదశి ఆదివారం, మిథున లగ్నం, విశాఖ నక్షత్రం, వృశ్చిక రాశి నందు జన్మించారు. 2019 వరకూ ఏల్నాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని శంఖు పూలతో ఆరాధించడం వల్ల సర్వదా పురోభివృద్ధి కానరాగలదు. లగ్నము నందు కేతువు, భార్య స్థానము నందు రవి, బుధ, గురు, రాహువులు ఉండటం వల్ల, తక్షక కాలసర్పదోష శాంతి చేయించండి. 2019 వరకు కేతు మహర్దశ మీకు సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. 2019 నుంచి శుక్ర మహర్దశ 20 సంవత్సరములు దినదినాభివృద్ధిని పొందుతారు. దేవాలయాల్లో కొబ్బరిచెట్టును నాటిన శుభం కలుగుతుంది.