జి. వేణుగోపాలరెడ్డి-తిమ్మారెడ్డిపాలెం: మీరు పంచమి ఆదివారం, సింహ లగ్నము, రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. లగ్నము నందు రాహువు ఉండటం వల్ల భార్య స్థానము నందు కుజ, కేతువు, రవి ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి.
కుటుంబ దోషం ఉండటం వల్ల చిన్నచిన్న విషయాల్లో అశాంతి చోటుచేసుకునే అవకాశం ఉంది. 2017 ఏప్రిల్ వరకూ రాహు మహర్దశ మీకు సామాన్యంగా ఉండగలదు. 2017 ఏప్రిల్ నెల నుంచి గురు మహర్దశ 16 సంవత్సరములు మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. ఈశ్వర ఆరాధన వల్ల ఐశ్వర్యాభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది. ఏదైనా దేవాలయంలో నేరేడు చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి.