ఎమ్.విజయసాయి భావన అభిక్షిత-హైదరాబాద్: మీరు అష్టమి గురువారం, మీనలగ్నము, భరణి నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. 2017 వరకు అష్టమశనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. సాంకేతిక, ఎంబీఎ వంటి రంగాల పట్ల ఏకాగ్రత వహించిన రాణిస్తారు. అప్పుడప్పుడు పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. 23 లేక 24 సంవత్సరము నందు బాగుగా స్థిరపడతారు. అదే సంవత్సరం నందు వివాహం అవుతుంది. శారదా దేవిని తెల్లని పూలతో పూజించడం వల్ల మీకు సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది. ఏదైనా ఉద్యాన వనంలో దేవదారు చెట్టును నాటిని శుభం కలుగుతుంది.