ఆర్.మనోజ్ కుమార్-ఖమ్మం: మీరు ఏకాదశి సోమవారం, మకర లగ్నము, ఉత్తరానక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. మీరు తాత్కాలికంగా ఉద్యోగం చేసినా భవిష్యత్తులో వ్యాపారంలో స్థిరపడతారు. సంతానం స్థానం నందు రవి, బుధ, శుక్ర, గురులు ఉండటం వల్ల హస్తగతం అయిపోవడం వల్ల సంతానదోషం ఏర్పడింది. పుత్రగణపతి వ్రతాన్ని చేయండి. 2016 లేక 2017 నందు మీరు తండ్రి కాబోతున్నారు.
2016 డిసెంబరు వరకు ఒత్తిడి, చికాకు, ఆందోళనలు వంటివి అధికంగా ఎదుర్కొంటారు. 2017 నుంచి 2026 వరకు మిగిలిన రాహు మహర్దశ అంతా స్థిరత్వాన్ని, అభివృద్ధిని పొందుతారు. దేవాలయాల్లో నేరు చెట్టును నాటిన శుభం కలుగుతుంది. అలాగే 100 గ్రాముల బియ్యం, 100 గ్రాముల మినుములు, 100 గ్రాముల గోధుమలు కలిపి నూక చేసి నల్లచీమలు ఉన్నచోట ప్రతిరోజూ ఒక స్పూనుడు వేయండి. మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి.