జి.శ్రీధర్-అనకాపల్లి: మీరు అమావాస్య బుధవారం, ధనుర్ లగ్నము, స్వాతినక్షత్రం, తులారాశి నందు జన్మించారు. రాజ్య, ఉద్యోగాధిపతి అయిన బుధుడు లాభమునందు రవి, శుక్ర, కుజ, చంద్రులతో కలిసి హస్తగతం అయి పోవడం వల్ల మీరు సరిగ్గా స్థిరపడలేదు.
2017 వరకు ఏల్నాటి శని దశ సాగుతుంది. ఈ కాలంలో పురోభివృద్ధి ఓ మోస్తరుగా ఉంటుంది. 2014 సెప్టెంబరు తదుపరి బుధ మహర్థశ ప్రారంభమైంది. ఆ తదుపరి 17 సంవత్సరములు ఉన్నత స్థితిలో ఉంటారు. మీరు అనుకున్నది సాధిస్తారు. కనకధారా స్తోత్రం చదివినా లేక విన్నా ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు.