జాతకం

వృషభం
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ప్రణాళిలు వేసుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆది, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గృహమార్పు అనివార్యం. పాత మిత్రులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు నిరాశాజనకం. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.