జాతకం

కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు శుభసమయం నడుస్తోంది. లక్ష్యాలను సాధిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రుణ సమస్యలు తొలగుతాయి. తాకట్టులను విడిపించుకుంటారు. శుక్రవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాల్లో మార్పుచేర్పులు సానుకూలమవుతాయి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో లాభాలు, అనుభం గడిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.