జాతకం

మీనం
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆర్థికలావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా స్థిమిత పడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆప్తుల వ్యాఖ్యలు మీపై చక్కని ప్రభావం చూపుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సంతానం విదేశీ విద్యాయత్నాలు ఫలిస్తాయి. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. గృహనిర్మాణాలు, మరమ్మతులు పూర్తవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.