
కన్య
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. గత సంఘటనలు పునరావృతమవుతాయి. అందరితోను మితంగా సంభాషించండి. పరిచయస్తుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఆదాయం అంతంత మాత్రమే. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. మీ శ్రీమతి సలహా ప్రయోజనం కలిగిస్తుంది. గురు, శుక్ర వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.