జాతకం

ధనస్సు
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. రావలసిన ధనం అందుతుంది. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. బుధ, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. బంధువులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో అనుకూలతలున్నాయి. వృత్తిపరమైన చికాకులను అధిగమిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి. పత్రాలు అందుకుంటారు. స్థల వివాదాలు పరిష్కారమవుతాయి.