జాతకం

మకరం
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. నూతన పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అవకాశాలను దక్కించుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. గురువారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడుదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. మధ్యవర్తులు, ప్రకటలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులకు మీపై గురి కుదురుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. విందులు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు.