జాతకం

కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఆదాయం బాగుంటటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. శనివారం నాడు ఆప్రియమైన వార్త వింటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. ఏ విషయాన్నీ తేలికగా కొట్టివేయొద్దు. గృహమార్పు అనివార్యం. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. ఏకాగ్రతతో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త