జాతకం

మీనం
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. మీ సమర్థతను తక్కువ అంచనా వేయొద్దు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆత్మీయుల హితవు మీపై చక్కని ప్రభావం చూపుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం చేయండి. దంపతుల మధ్య సఖ్యతలోపం. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.