జాతకం

వృషభం
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు శుభసమయం నడుస్తోంది. ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. స్వయంకృషితోనే లక్ష్యాలు సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆదివారం నాడు పనులు సాగవు. కొందరిరాక అసౌకర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులు ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. విజ్ఞతతో వివాదాలు పరిష్కరించుకోండి.