జాతకం

వృశ్చికం
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు అభీష్టం నెరవేరుతుంది. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మరింత బలపడతాయి. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. అందరితోను మితంగా సంభాషించండి. అవేశాలకు లోనుకావద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మంగళవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకుంటారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. వాహనం, గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతలు సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు.