జాతకం

మేషం
మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. ఆహ్వానం అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. పొదుపు పథకాలు, పెట్టుబడులు లాభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పదవుల కోసం యత్నాలుసాగిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మంగళ, బుధవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పనులు ముందుకుసాగవు. అనవసర జోక్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. పందేలు, జూదాల జోలికి పోవద్దు. దైవకార్యాల్లో పాల్గొంటారు.