జాతకం

మకరం
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. యత్నాలు విరమించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. సన్నిహితులు హితువు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. సంతానం రాక ఉత్సాహం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు హోదా మార్పు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వాహన చోదకులు దూకుడు తగదు. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి.