కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. మనోధైర్యంతో మెలగండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆది, శనివారాల్లో పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా వారికి నచ్చచెప్పండి. ఆరోగ్యం బాగుంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు.