జాతకం

మీనం
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి శ్రమాధిక్యత మినహా ఫలితం శూన్యం. వ్యవహారంలో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మంగళవారం నాడు ఆచితూచి అడుగేయండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. కొందరి రాక చికాకు పరుస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. సామరస్యంగా మెలగండి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్చు, స్థానచలనం, నూతన వ్యాపారాలకు తరుణం కాదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు.