జాతకం

వృషభం
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. బంధుత్వాలు బలుపడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. మంగళ, బుధ వారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తృతమవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. ఊహించని సంఘటనలెదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం.