జాతకం

మిథునం
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు. అన్ని రంగాల వారికి శుభయోగమే. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆందోళన తొలగి కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గురు, శుక్ర వారాల్లో ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనం. ఉపాధ్యాయులు ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అదికారులకు హోదా మార్పు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది.