జాతకం

కర్కాటకం
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష అన్ని రంగాల వారికీ బాగుంటుంది. అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అనుకూలిస్తాయి. గురువారం నారు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, కొత్త వ్యక్తులను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం, వ్యాపారాలు జోరుగా సాగుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది.