జాతకం

సింహం
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పరిచయంలేని వారితో జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. మంగళ, బుధవారాల్లో ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సన్నిహితుల సలహా పాటించండి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. పోగొట్టుకున్న వస్తువుల లభ్యమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. వేడుకలకు హాజరవుతారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఏ విషయాన్ని మనస్సులో ఉంచుకోవద్దు. విజ్ఞతతో వ్యవహరించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు, ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు పనిభారం.