జాతకం

కన్య
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దుబారా ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. సోమ, మంగళ వారాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని గమనించండి. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.