జాతకం

తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి అధికం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటుతనం ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కీలక పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, వెండి బంగారాలు జాగ్రత్త.