జాతకం

వృశ్చికం
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమీద నెరవేరుతాయి. శుక్ర, శనివారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ ప్రమేయం అనివార్యం. మీ సలహా ఎదుటివారికి సంతృప్తినిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సంతానం క్షేమం తెలుసుకుంటారు.