జాతకం

ధనస్సు
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. అంచనాలు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. బాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆప్తుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. శనివారం నాడు ఓర్పుతో వ్యవహరించాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. అధికారులతో జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటారు. క్రీడా, కళాకారులకు ప్రోత్సాహకరం.