జాతకం

కుంభం
కుంభ రాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు ఆదాయం 14, వ్యయం: 14 రాజపూజ్యం : 6, అవమానం 1 ఈ రాశివారికి ఏలినాటి శనిప్రభావం, గురుబలం లోపం అధికంగా ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఊహించని ఖర్చులు, చేతిలో ధనం నిలవదు. ఆచితూచి అడుగేయాలి. దంపతుల మధ్య అకారణ కలహాలు. బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కుంటారు. మనస్థిమితం ఉండదు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. వాస్తుదోష నివారణ చర్యలు తప్పనిసరి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. వీరు పోటీ పరీక్షల్లో సామాన్య ఫలితాలే సాధిస్తారు. దూరప్రాంతంలోనే ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వ్యవసాయ రంగాల వారికి దిగుబడి వంట బాగుంటుంది. ఆశించిన మద్దతు ధర పొందుతారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ప్రముఖులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి ఆదాయాభివృద్ధి. న్యాయవాదులు, వైద్యులకు సామాన్యం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహయత్నం ఫలిస్తుంది. తరచూ విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఈ రాశివారికి కనకదుర్గమ్మ స్తోత్ర పారాయణం, శనికి తైలాభిషేకాలు క్షేమదాయకం.

జనవరి-2024

కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు సంప్రదింపులు ఫలిస్తాయి. అందరితో కలుపుగోలుగా మెలుగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. పనులు సానుకూలమవుతాయి. సభ్యత్వాలు,....more

ఫిబ్రవరి-2024

కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ఈ మాసం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొన్నింటిలో అనుకూలత, మరి కొన్నింటిలో ప్రతికూలతలు ఎదురవుతాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల....more

మార్చి-2024

కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ఆర్థికస్థితి సామాన్యం. ఖర్చులు అదుపులో ఉండవు. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. మనోబలంతో యత్నాలు సాగించండి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. సమర్ధతపై నమ్మకం పెంచుకోండి.....more

ఏప్రియల్-2024

కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ప్రేమానుబంధాలు బలపడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. లక్ష్యాలను సాధిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు....more

మే-2024

కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు కార్యసాధనలో జయం, ధనలాభం ఉన్నాయి. మనోభీష్టం నెరవేరుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. రుణసమస్యలు తొలగుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. చేపట్టిన....more