జాతకం

కర్కాటకం
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6 గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఓర్పుతో యత్నాలు సాగించండి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులతో జాగ్రత్త. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. తరచు ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యపరీక్షలు చేయించుకోవటంలో అలక్ష్యం తగదు. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. తరచు శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కష్టసమయం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. భనూతన వ్యాపారాలకు అనుకూలం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకం. పంట దిగుబడి బాగున్నా ఆశించిన మద్దతు ధర లభించదు. బిల్డర్లకు ఆశాజనకం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విదేశాల సందర్శనకు పాస్‍‌పోర్టు, వీసాలు మంజూరవుతాయి. ధార్మికత పట్ల ఆసక్తిం పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశివారికి శుభదాయకం.

జనవరి-2025

కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఈ మాసం శుభాశుభాల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. ద్వితీయార్ధం....more

ఫిబ్రవరి-2025

కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. మనోధైర్యంతో మెలగండి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. రావలసిన ధనాన్ని సామరస్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. మీ అలక్ష్యం ఇబ్బందులకు....more

మార్చి-2025

కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష గ్రహబలం స్వల్పంగానే ఉంది. ఆచితూచి అడుగు ముందుకేయండి. నిర్ణయం తీసుకునే ముందు పెద్దల అభిప్రాయం తెలుసుకోండి. ఏకపక్షంగా వ్యవహరిస్తే నష్టాలు తప్పవు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం....more

ఏప్రియల్-2025

కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఈ మాసం కలిసివచ్చే కాలం. బుద్ధిబలంతో లక్ష్యం సాధిస్తారు. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. రాని బాకీలు వసూలు కాగలవు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది....more

మే-2025

కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఈ మాసం శుభాశుభాల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. ద్వితీయార్ధం....more

జూన్-2025

కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఈ మాసం ప్రథమార్ధం అనుకూలం. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. చేపట్టిన ప్రతి పని అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వ్యవహార లావాదేవీలతో సతమతమవుతారు. ప్రతి....more

జులై-2025

కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష శుభవార్త వింటారు. కష్టం ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. వృధా ఖర్చులు తగ్గించుకోగల్గుతారు. అవకాశాలను కలిసివస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. సంతానం విదేశీ చదువుపై దృష్టి....more