జాతకం

కన్య
కన్య రాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఆదాయం 5, వ్యయం: 5, రాజపూజ్యం: 5, అవమానం: 2 ఈ రాశివారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సంకల్పసిద్ధి, వ్యవహారజయం పొందగలరు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు, వాహనం అమర్చుకోగల్గుతారు. దీర్ఘకాలికంగా తీరని కోరికలు ఈ సంవత్సరం నెరవేరగలవు. తరచు శుభకార్యాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోగలవు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొత్త పనులు ప్రారంభ సమయంలో ఆటంకాలెదుర్కుంటారు. శకునాలను పట్టించుకోకుండా మనోధైర్యంతో వ్యవహరించండి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగాలి. ఉపాధ్యాయులు తరచు ఒత్తిళ్ళలకు గురవుతుంటారు. ప్రముఖుల జోక్యంతో కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. పన్నుల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యం. దిగుబడి బాగున్నా మద్దతు ధర సంతృప్తినీయదు. బిల్డర్ల ఆదాయం బాగుంటుంది. తరచు ఆలయాలు సందర్శిస్తారు. అసాంఘిక కార్యకాలాపాల జోలికి పోవద్దు. ఈ రాశివారికి శ్రీ కనకదుర్గమ్మ, మల్లేశ్వరసామిల ఆరాధన అన్ని విధాలా శుభదాయకం.

జనవరి-2025

కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు కీలక విషయాలపై పట్టుసాధిస్తారు. మీ ఆధిపత్యం కొనసాగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పలు కార్యక్రమాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. కానుకలు, పురస్కారాలు అందుకుంటారు. ఆదాయ వ్యయాలకు....more

ఫిబ్రవరి-2025

కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు తలపెట్టిన కార్యక్రమం విజయవంతమవుతుంది. పట్టుదలతో శ్రమించి లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. సకాలంలో రుణవాయిదాలు చెల్లించండి. వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి....more

మార్చి-2025

కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు గ్రహబలం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. ఆశావహదృక్పథంతో మెలగండి. కలిసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితుల సాయంతో....more

ఏప్రియల్-2025

కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు పరిస్థితులు చక్కబడతాయి. ధృఢసంకల్పంతో వ్యవహరించండి. మీదైన రంగంలో బుద్ధిబలంతో శ్రమించాలి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు.....more

మే-2025

కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు కీలక విషయాలపై పట్టుసాధిస్తారు. మీ ఆధిపత్యం కొనసాగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పలు కార్యక్రమాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. కానుకలు, పురస్కారాలు అందుకుంటారు. ఆదాయ వ్యయాలకు....more

జూన్-2025

కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు బుద్ధిబలంతో యత్నాలు సాగించండి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. సమష్టి కృషితో లక్ష్యం సాధిస్తారు. ప్రతికూలతలు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు....more

జులై-2025

కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.....more