జాతకం

వృశ్చికం
వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం : 4 అవమానం: 5 ఈ సంవత్సరం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. సంకల్పసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. ఎవరిపైనా ఆధారపడవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలు అంచనాలు విరుద్ధంగా ఉంటాయి. తరచు చేబదుళ్లు, రుణాలు చేయవలసి వస్తుంది. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. తరుచు శుభకార్యాల్లో పాల్గొంటారు. వాస్తుదోష నివారణ ఫలితాలు నిదానంగా కనిపిస్తాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కీలక పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఊహించని సంఘటనలెదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. గృహనిర్మాణాలు చేపడతారు. బిల్డర్లు, కార్మికులకు ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. విష్ణు సహస్ర నామ పారాయణం, కనకధారా స్తోత్రములు ఈ రాశివారికి మంచి ఫలితాలిస్తాయి.

జనవరి-2024

వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభాపాఠవాలు వెలుగుచూస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రుల....more

ఫిబ్రవరి-2024

వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. మీ నిజాయితీ ప్రశంసనీయమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి.....more

మార్చి-2024

వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా....more

ఏప్రియల్-2024

వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. సోదరుల మధ్య....more

మే-2024

వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట ఈ మాసం అనుకూలదాయకం. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సంతానం....more