జాతకం

ధనస్సు
ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం: 7, అవమానం 5, ఈ రాశి అన్ని రంగాల వారికీ యోగదాయకమే. ఆర్థికంగా బాగుంటుంది. పొదుపు పథకాలు కలిసివస్తాయి. ఖర్చులు సామాన్యం. సంకల్పసిద్ధి. వ్యవహార జయం ఉన్నాయి. వ్యవహార పరిజ్ఞాంతో రాణిస్తారు. యత్నాలకు సన్నిహితులు సహకారం అందిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అవివాహితులకు శుభయోగం. మీ చొరవతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు, నగదు అపహరణకు గురవుతాయి. దంపతుల మధ్య సఖ్యత, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. స్థిరచరాస్తుల కొనుగోళ్లకు అనుకూలం. దళారులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వ్యవసాయ రంగాల వారికి రెండో పంట ఆశించిన దిగుబడినిస్తుంది. పంటకు తగిన మద్దతు ధర పొందుతారు. సంకల్పసిద్ధికి శివదర్శనాలు, హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశివారికి శభదాయకం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. టెండర్లు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థుల విదేశీ విద్యాయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశివారికి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణం శుభాన్నిస్తాయి.

జనవరి-2024

ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. మధ్యవర్తులను నమ్మవద్దు. ప్రతి....more

ఫిబ్రవరి-2024

ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఈ మాసం బాగుంటుంది. కార్యసిద్ధి, వ్యవహారజయం పొందుతారు. రావలసిన ధనం అందుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమస్య మీకు అనుకూలంగా....more

మార్చి-2024

ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వాయిదా పడిన పూర్తి చేస్తారు. వివాహయత్నం....more

ఏప్రియల్-2024

ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం సర్వత్రా అనుకూలదాయకమే. కార్యసిద్ధి, ప్రశాంతత ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. పరిచయస్తులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. అభివృద్ధిపథంలో ముందుకు సాగుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు....more

మే-2024

ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పట్టుదలతో శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు....more