జాతకం

మకరం
ఈ రాశివారికి 2020 ఫిబ్రవరి వరకు వ్యయము నందు శని, ఆ తదుపరి జన్మమము నందు, ఈ సంవత్సరం అంతా షష్టమము నందు రాహువు, వ్యయము నందు కేతువు, నవంబర్ 4వ తేదీ వరకు లాభం నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా వ్యయము నందు సంచరిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశివారి ''''మిత్ర బుద్ధిః ప్రళయాంతకః'''' అన్నట్లుగా మీ మిత్రుల వలన ధన నష్టం, మాననష్టం జరిగే అవకాశం ఉన్నందువలన ప్రతి పనిలోనూ, ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశి వారికి ఏలినాటి సంచారం బాగుండడంతో కొంత సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా గానీ అనుకూలంగా ఉన్నదనే చెప్పవచ్చు. ఇబ్బందికర వాతావరణం ఎదుర్కునే విధంగా బుద్ధికుశలత ఉపయోగించి బయటపడతారు. ధనస్సులో ప్రవేశించినది మొదలు మీకు ఖర్చులు ఎక్కువ కావడం, ఋణాలు, కొంత చికాకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో అధిక శ్రమ పడవలసి ఉన్నది. అధికారులతో అప్రమత్తత అవసరం. తోటివారి తీరు మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో నవంబరు వరకు లాభదాయకంగా ఉంటుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఎండుమిర్చి, కంది, మినుము పంటలు బాగా పండుతాయి. అనారోగ్య సమస్యలకు మంచి తరుణోపాయం దొరుకుతుంది. కళ్ళు, తల, నరాలకు సంబంధించిన సమస్యల నుండి కొంతబయటపడతారు. ఆరోగ్య విషయంలో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదేశీయాన యత్నాలు ఫలించగలవు. స్థిరాస్తుల అభివృద్ధి, కొనుగోలు యత్నాలలో మీరుచేసే యత్నాలి ఫలితాయి. పాత సమస్యలు ఒక కొలిక్కిరాగలవు. మానసిక ఒత్తిడి, పనుల మీద దృష్టి అధికంగా ఉంటుంది. కోర్టు వ్యవాహరాల్లో ఉన్నవారికి చక్కని ప్రణాళికలు, సలహాలు, సహకారం అందుతాయి. శనివ్యయంలో సంచారం చేయునపుడు ప్రతి పనిలో ఒత్తిడి, అలసట, గౌరవభంగం వంటివి ఎదుర్కునే ఆస్కారం ఉంది. కొన్ని సమయాల్లో అనుకోని లాభాలు పొందే ఆస్కారం ఉంది. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు పూర్తిచేస్తారు. ముఖ్యుల సహకారం మీకు అందుతుంది. అధికంగా ఆలోచించి ఇబ్బందులకు గురికాకండి. పుణ్యకార్యాలు విరివిగా చేస్తారు. అవివాహితులకు శుభదాయకం. తాము ఇష్టపడిన సంబంధాలు అయ్యే ఆస్కారం ఉంది. కంప్యూటర్, ఎలక్ట్రానికి రంగాల్లోవారికి కలిగిరాగలదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోవారికి పనిభారం అధికమవుతుంది. పనివారి వలన ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ప్రయాణాలు, తీర్థయాత్రల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఆధ్యాత్మిక చింతనలో గడపడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యవసాయ దారులు అనుకున్న పంటలు వేసినప్పటికి తగిన గిట్టుబాడు ధరలు అందక కొంత నిరుత్సాహం చెందుతారు. ఎగుమతి, దిగుమతుల్లో కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. స్పెక్యులేషన్ కలిసిరాగలదు. * వర్తమానం ఏలినాటి శనిదోషం ఉన్నందువలన ప్రతి శనివారం 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి, నీలపు శంకు పూలతో శనిని పూజించిన ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి చేకూరుతుంది. * ఈ రాశివారు వేంకటేశ్వరస్వామిని తెల్లని పూలతో గానీ, పున్నాగ పూలతో గానీ పూజించిన ఆటంకాలు తొలగిపోతాయి. * ఉత్తరాషాడ నక్షత్రం వారు పనస చెట్టును, శ్రవణా నక్షత్రం వారు జిల్లేడు చెట్టును, ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును నాటిన సర్వదోషాలు తొలగిపోతాయి. * ఉత్తరాషాడ నక్షత్రం వారు జాతికెంపు, శ్రవణా నక్షత్ర వారు స్పందన ముత్యం, ధనిష్ట నక్షత్రం వారు తెల్లపగడం ధరించిన సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది.

జనవరి-2019

ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడుతాయి.....more

ఫిబ్రవరి-2019

మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు పెరుగుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పరిచయాలు బలపడుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు.....more

మార్చి-2019

కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. వేడుకలు, శుభకార్యాన్ని ఆడంబరంగా పూర్తిచేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. కొన్ని....more

ఏప్రిల్-2019

మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఈ మాసం ఆశాజనకమే. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఆవసరాలు నెరవేరుతాయి. రుణ విమక్తులవుతారు. పరిచయాలు బలపడుతాయి. దీర్ఘకాలిక సమస్యలు....more

మే-2019

మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆశ్చర్యకరమైన ఫలితాలు తెలుసుకుంటారు.....more

జూన్-2019

మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ మాసం ఆశాజనకమే. బంధుత్వాలు బలపడతాయి. గృహమార్పు కలిసివస్తుంది. వివాహ యత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి.....more

జులై-2019

మకర రాశి : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఆర్థిక స్థితి నిరాశాజనకం. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి.....more

ఆగస్టు-2019

నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వస్తులాభం,....more

సెప్టెంబర్-2019

మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టిపెడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి.....more

అక్టోబర్-2019

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. సహాయం, సలహాలు ఆశించవద్దు. నమ్మకస్తులే మోసగించే ఆస్కారం వుంది.....more

నవంబర్-2019

మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఈ మాసం గ్రహాల ప్రతికూలతలు సమస్యలు, చికాకులు ఎదుర్కొంటారు. మీ ఆలోచనలు, అభిప్రాయాలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంలోను మనస్థిమితంగా అంతగా ఉండదు.....more