జాతకం

మిథునం
ఈ సంవత్సరం మీ గోచారం పరీక్షించగా ''''గౌరవమ్ లభ్యతే దానాత్'''' అన్నట్లుగా దానధర్మాలు చేయడం వలన బంధుమిత్రుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆదాయం బాగానే ఉన్నప్పటికి ఆర్థిక వ్యవహారాల యందు సరైన ప్రణాళికలు వేయలేక వృధా ఖర్చును అదుపు చేయలేక విఫలమవుతారు. కొన్నికొన్ని చోట్ల ధన విషయంగా, సహకార విషయంగా మోసపూరిత వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది జాగ్రత్త వహించండి. జన్మరాహులక్షణం వలన భార్యాపుత్ర విరోధన కలుగుచేయడం ప్రతి అంశంలోను కలహాములు, కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగ వ్యవరారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికి ప్రమోషన్స్, గుర్తింపు, గౌరవం పొందుతారు. విద్యార్థులకు బుద్ధి స్థిరత్వం చాలా తక్కువగా ఉంటాయి. ఇతర క్రీడాలు, వ్యాసాంగాలకు ఎక్కువ సమయం కేటాయించడం వలన అనుకున్నదానికన్నా తక్కువ ఫలితాలు పొందే సూచనలున్నాయి. నిరుద్యోగుల ఉద్యోగయత్నాలు తీవ్రతరమవుతాయి. ఏదైనా చిన్న ఉద్యోగంలోనైనా స్థిరపడే యత్నాలు చేస్తారు. ప్రతి విషయంలోను ఆలస్యం చోటుచేసుకుంటుంది. మీరు శ్రమించి త్వరగా కార్యం పూర్తి చేయాలన్న ఆ పనికి సంబంధించిన ప్రతిఫలం ఆలస్యంగా అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారులకు కలిసిరాగలదు. స్థిర, చరాస్తులను అభివృద్ధి చేసే ఆలోచనులు చేస్తారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఈ విషయంలో ఎవరినీ నమ్మకుండా స్వనిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రస్తుతం దానిని పక్కన పెట్టి ముందుకు పోయే అలోచనలు చేస్తారు. విదేశీయాన యత్నాల్లో అధిక ధనవ్యయం, కాల వ్యయం తప్పదు. అధిక కృషి అనంతరం సత్ఫలితాలు పొందుతారు. కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. ఆరోగ్యం ఏ మాత్రం సహకరించదు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్, మీడియా రంగాల్లో వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అవివాహితులకు శుభసమయం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమవుతుంది. హామీలకు, చెల్లింపులకు దూరంగా ఉండటం మంచిది. సినీ, కళా రంగాల్లో వారికి అనుకోని అవకాశాలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూరప్రయాణం, పుణ్యక్షేత్రాల దర్శన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. విలువైన వస్తు, వాహనాలు ఏర్పాటు చేసుకోగలుగుతారు. వైద్య రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉన్నప్పటికి వారి సేవలకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. వ్యవసాయ రంగాల్లో వారికి శ్రమ పొందటమే కాకుండా నకిలీ వస్తువుల వినియోగం వంటివి కూడా జరిగే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టైతే అనుకున్న ఫలసాయం పొందుతారు, షేర్ మార్కెట్ రంగాల్లో వారికి కలిగిరాగలదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి శుభకాలం. ప్రతీ అంశాన్ని స్వయంగా చూసుకోవడం మంచిది. ముఖ్య విషయాల పట్ల ఏకాగ్రత వహించి, నిరుత్సాహం, నిర్లిప్తత వదిలి ముందుకు సాగిన ఈ సంవత్సరం ఈ రాశివారి సత్ఫలితాలు పొందవచ్చు. * ఈ రాశివారు పంచముఖ ఆంజనేయునికి తమలపాకులతో పూజించడం వలన సర్వదా అభివృద్ధి కానవస్తుంది. * మృగశిర నక్షత్రం వారు మారేడు, ఆరుద్ర నక్షత్రం వారు చింత, పునర్వసు నక్షత్రం వారు గన్నేరు, మొక్కను దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లోగానీ, ఖాళీ ప్రదేశాల్లో గానీ నాటిన మీకు పురోభివృద్ధి కానవస్తుంది. * మృగశిర నక్షత్రం వారు జాతి పగడం, ఆరుద్ర నక్షత్రం వారు ఎర్రగోమేధికం, పునర్వసు నక్షత్రం వారు కనకపుష్యరాగం లేకా వైక్రాంతమణి అనే రాయిని ధరించిన శుభం కలుగుతుంది.

జనవరి-2019

మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంప్రదింపులు ఫలిస్తాయి.....more

ఫిబ్రవరి-2019

మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు కష్టం ఫలిస్తుంది. శుభవార్తలు వింటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. దస్త్రం, వేడుకలకు....more

మార్చి-2019

మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ మాసం శుభాశుభ మిశ్రమాల సమ్మేళనం. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. యత్నాలు కొనసాగించండి. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వ్యయాలకు....more

ఏప్రిల్-2019

మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు....more

మే-2019

మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ప్రత విషయం స్వయంగా తెలుసుకోవాలి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ఆర్థిక....more

జూన్-2019

మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ మాసం ప్రథమార్థం ఏమంత అనుకూలం కాదు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణయత్నాలు సాగిస్తారు. అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే మోసగించేందుకు ప్రయత్నిస్తారు.....more

జులై-2019

మిథున రాశి : మృగశిర 3, 4 పాదాలు. ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ మాసం ప్రథమార్థం ఆశాజనకం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కివస్తాయి. ఖర్చులు....more

ఆగస్టు-2019

పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. దుబారా ఖర్చలు అధికం. చేతిలో ధనం నిలబడదు. ఆత్మీయులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది.....more

సెప్టెంబర్-2019

మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు. ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది.....more

అక్టోబర్-2019

మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు. అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధనలాభం ఉంది. ఖర్చులు భారమనిపించవు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త వహించండి.....more

నవంబర్-2019

మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ మాసం శుభాశుభాలు మిశ్రమంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మొహమ్మాటాలు, భేషజాలకు పోకూడదు. సోదరీసోదరులతో సఖ్యత నెలకొంటుంది. మీ నిర్ణయాలకు కుటుంబీకులు....more