జాతకం

వృశ్చికం
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట ఆదాయం: 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 3 ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఆదాయం ఎంత వచ్చినా చేతిలో ధనం నిలవదు. కుటుంబ పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. సంతానం కోసం విపరీతంగా శ్రమిస్తారు. తరచూ ఆరోగ్యం భంగం, ప్రశాంతత లోపిస్తాయి. ఆత్మీయుల సాయంతో కొన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. స్థిరాస్తుల విక్రయం తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. శుభకార్య యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సోదరులతో సంప్రదింపులు ఫలిస్తాయి. ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు స్థానచలనం, ఉపాధ్యాయులకు పదోన్నతి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. పాస్‌పోర్టు, వీసాలు పొందుతారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. విశాఖ నక్షత్రం వారికి కనకపుష్యరాగం, అనూరాధ వారికి పుష్యనీలం, జ్యేష్ఠవారికి గరుడపచ్చ ధరించిన శుభం కలుగుతుంది. కార్తీకేయుడిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగిపోగలవు. విశాఖ నక్షత్రం వారు మొగలి మొక్కను దేవాలయాల్లో కానీ, విద్యాసంస్థల్లో కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ నాటి దాని అభివృద్ధికి పాటుపడిన శుభం కలుగుతుంది.

జనవరి-2020

వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయులకు సాయం అందిస్తారు.....more

ఫిబ్రవరి-2020

వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యోష్ట శుభకార్యంలో పాల్గొంటారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు ఉంటాయి. ఆదాయ వ్యయాలు....more

మార్చి-2020

వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం, అనూరధ, జ్యేష్ట అన్ని రంగాల వారికి బాగుంటుంది. వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అవకాశాలు కలిసివస్తాయి. మాట నిలబెట్టుకుంటారు. ఖర్చులు అదుపులో....more

ఏప్రిల్-2020

మే-2020