అడ్డసరం మొక్కతో కరోనాకు విరుగుడు.. ఆయుర్వేద గుణాలెన్నో..?

సోమవారం, 19 ఏప్రియల్ 2021 (17:26 IST)
Adusa plant
అడ్డసరం మొక్క గురించే ప్రస్తుతం నెట్టింట చాలామంది చర్చించుకుంటున్నారు. దీనిని ఉపయోగించి కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. కరోనా వైరస్‌పై ఈ మొక్క ఏ మేరకు పని చేస్తుందనే విషయంపై ఢిల్లీలోని ఆయుర్వేద, ఐజీఐబీ వంటి జాతీయ సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాయి. అయితే ఈ మొక్క సానుకూల ఫలితాలు ఇవ్వడంతో ఆశలను రేకెత్తిస్తోంది.
 
ఈ మొక్కలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. దీని ఆకులు, పూలు, వేర్లు, కాండం మందుల తయారీలో ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. దీనిని వివిధ వ్యాధుల నివారణకు కూడా వినియోగిస్తున్నారు. చర్మవ్యాధులు, దగ్గు, జలుబు, ఉబ్బసం, రక్తస్రావం నివారణకు, పలు వ్యాధుల చికిత్సలకు ఉపయోగిస్తున్నారు. ఆకులను ప్రత్యేకంగా కొన్ని వ్యాధులు నయం కావడానికి ఉపయోగిస్తారు. కాండం, పుష్పాలు ఇలా ప్రతీ దానికి ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు.
 
ఇప్పడు అన్నింటిని ఉపయోగించి కరోనాను నియంత్రించడానికి దీనిని వినియోగించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కరోనా రోగికి ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు కనపడతాయి. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి లక్షణాలు లేకున్నా కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇది ఆందోళన కలిగించే అంశం అయినప్పటికీ కరోనా నివారణకు అడ్డసరం మొక్క ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
 
కరోనా రోగిలో ఎక్కువ శాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటాడు. ఆక్సిజన్ స్థాయి తగ్గడం, రక్తం గడ్డకట్టడం వంటివి కూడా చూస్తుంటాం. వీటిని నియంత్రించడంలో ఈ మొక్క ఎంతగానో దోహదపడుతుందని పరిశోధనల్లో తేలింది. వైరస్‌ ప్రభావాన్ని తగ్గించడానికి, రోగనిరోధకశక్తిని పెంచడానికి తోడ్పడే జన్యువులకు సహాయపడే గుణాలు అడ్డసరం మూలికలలో ఉన్నాయని అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన పత్రం తాజాగా రెస్పిరేటరీ రీసెర్చ్‌ పబ్లికేషన్‌లో ప్రచురితం అయింది.
 
దీంతో ప్రతీ ఒక్కరికీ ఆశలు రేకెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిశోధనల్లో అడ్డసరం మొక్క ఉపయోగపడితే చాలా మంది ప్రాణాలను కాపాడటంతో పాటు మహమ్మారి నుంచి కూడా పూర్తిగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు