కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపున తీసుకునేవారిలో బీపీ కంట్రోల్‌లో ఉంటుందట. అంతేకాకుండా కంటిచూపు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొత్తిమీర జ్యూస్ ఎలా చేయాలంటే..? ఒక కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి. రెండు టీ స్పూన్ల నిమ్మరసం, అర టీ స్పూన్ ఉప్పు, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అన్నింటినీ మిక్సర్‌లో మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని వడపోయకుండా అలానే తాగాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ జ్యూస్ తీసుకున్న అరగంట వరకు ఏ ఆహారం తీసుకోకూడదు. దీనివల్ల షుగర్, కొలెస్ట్రాల్, బీపీ కంట్రోల్‌లో ఉంటాయి.