శరీరంలోని రక్తం శుద్ధికాని పక్షంలో అలసట, జ్వరం, ఉదర సంబంధిత రుగ్మతలు, శ్వాసకోశ వ్యాధులు ఏర్పడుతాయి. అందుకే రక్తశుద్ధికి తగిన ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
అలాగే రక్త ప్రసరణ మెరుగ్గా వుంటే హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంకా రోజుకో కప్పు పెరుగును తీసుకోవడం ద్వారా గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇంకా మరిగించి ఆరబెట్టిన నీటిలో జీలకర్ర పొడి చేర్చి ఆరు గంటలపాటు ఊరనివ్వాలి. ఆ నీటిని సేవించడం ద్వారా రక్తపోటు క్రమంగా తగ్గుతుంది.