కరోనావైరస్: పారిస్ నుంచి పల్లె సీమకు రాత్రికి రాత్రి భారీ వలసలు - Newsreel

శుక్రవారం, 30 అక్టోబరు 2020 (14:07 IST)
ఫ్రాన్స్‌లో దేశవ్యాప్తంగా కొత్తగా లాక్‌డౌన్ ప్రకటించారు. అది అమలులోకి రావటానికి ముందు రాజధాని నగరం పారిస్ నుంచి భారీ స్థాయిలో ప్రజలు ఇతర ప్రాంతాలకు ప్రయాణమయ్యారు. గురువారం సాయంత్రం పారిస్ పరిసరాల్లో ట్రాఫిక్ రికార్డు స్థాయికి పెరిగిపోయింది. మొత్తంగా చూస్తే 700 కిలోమీటర్ల నిడివి మేర ట్రాఫిక్ జామ్‌లు అయ్యాయని స్థానిక మీడియా చెప్పింది.

 
పారిస్ నగరవాసులు చాలా మంది లాక్‌డౌన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించటం కోసం నగరం విడిచి వెళ్లారని పేర్కొంది. కరోనావైరస్ కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవటానికి ఫ్రాన్స్ మరోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది. అత్యవసర పనులు, వైద్య కారణాలు మినహా ప్రజలు ఇళ్లలోనే ఉండాలనే ఆంక్షలు శుక్రవారం అర్థరాత్రి నుంచి ఇది అమలులోకి వచ్చాయి.

 
''కరోనావైరస్ సెకండ్ వేవ్.. దేశాన్ని ముంచెత్తే ప్రమాదం ఉంది'' అని దేశాధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో కోవిడ్ర19 వల్ల రోజు వారీ మరణాల సంఖ్య ఏప్రిల్ తర్వాత ఇప్పుడు మళ్లీ గరిష్ట సంఖ్యకు పెరిగాయి. గురువారం నాడు దేశంలో 47,637 కరోనా కేసులు, 250 మరణాలు నమోదయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు