గోరింటాకులో బీట్‌రూట్ రసం కలిసి జుట్టుకు పెట్టవచ్చా..?

మంగళవారం, 9 సెప్టెంబరు 2014 (15:59 IST)
* తలకు గోరింటాకు పెట్టుకునే ముందు దాంట్లో కాస్తంత బీట్‌రూట్ రసాన్ని కలిపితే జట్టుకు మంచి మెరుపుతోపాటు రాగిరంగు వస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటమే గాకుండా, దృఢంగా ఉంటుంది. అలాగే తలకు పెరుగుతో మర్దనా చేసి కాసేపాగి తలస్నానం చేస్తే కళ్ల మంటలు తగ్గుతాయి.
 
* కోడిగుడ్డు సొనకు నిమ్మకాయ రసం, పెరుగు కలిపి తలకు పట్టించి కాసేపు అలాగే నానబెట్టి ఆపై శుభ్రమైన నీటితో తలస్నానం చేస్తే జట్టు మృదువుగా తయారవుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. శీకాకాయ, పెసలు, ఉసిరి, కరివేపాకు, నిమ్మ తొక్కలు, మెంతులను ఎండబెట్టిన తరువాత విడివిడిగా పొడిగొట్టి తల చూర్ణంగా వాడుకుంటే వెంట్రుకలకు మెరుపు వస్తుంది.
 
* ఒక కప్పు దంపుడు  బియ్యానికి మూడు కప్పుల నీటిని పోసి ఉడికించి, అందులోంచి గంజిని వార్చి, చల్లార్చి జుట్టుకు పట్టించాలి. కాసేపటి తరువాత మళ్లీ అలాగే చేయాలి. ఇలా మూడుసార్లు చేసిన తరువాత తలస్నానం చేస్తే జుట్టు రాలటాన్ని అరకట్టవచ్చు. ఇక పెరుగును తల మాడుకు కాకుండా వెంట్రుకలకు మాత్రమే పట్టించి తలస్నానం చేస్తే, జుట్టుకు మంచి కండీషనర్‌లా ఉపయోగపడుతుంది. 

వెబ్దునియా పై చదవండి