కీరదోస గుజ్జులో కాసిని పాలు, నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకుని.. మచ్చలున్న చోట రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి ఇలా చేస్తే మచ్చలు తగ్గిపోతాయి. అలాగే టమోటా గుజ్జులో ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి మర్దన చేయాలి పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే ముఖంపై మచ్చలు తగ్గిపోతాయి.
ఇంకా ముఖంపై నల్లటి మచ్చలు తొలగిపోవాలంటే..
* కలబంద గుజ్జును తీసుకుని ఓ ఐదునిమిషాలు ఎండలో ఉంచాలి. అందులో కొన్నిచుక్కల నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. పదిహేను నిమిషాల తరవాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.