గోధుమపిండితో ఫేస్‌ప్యాక్ ఎలా వేయాలో చూద్దాం...

మంగళవారం, 31 జులై 2018 (12:20 IST)
గోధుమపిండిలో ఆరోగ్య విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి గోధుమపిండితో ఫేస్‌ప్యాక్ కూడా వేసుకోవచ్చట. మరి ఎలా వేయాలో తెలుసుకుందాం. 2 స్పూన్స్ గోధుమపిండిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
3 స్పూన్స్ గోధుమపిండిలో 2 స్పూన్స్ రోజువాటర్‌ను వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. పావుకప్పు గోధుమలను రాత్రివేళ నీళ్లలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని వడకట్టి దాని ద్వారా వచ్చే పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం, తేనెను కలుపుకుని ముఖానికి మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా, అందంగా మారుతుంది. చర్మంపై గల నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు