చెన్నయ్‌లో "బుల్‌చీ" ఎక్స్లూజివ్ స్టోర్ ప్రారంభం..!!

యాక్ససరీస్ విభాగంలో లగ్జరీ వస్తువులకు పెట్టింది పేరైన బ్రాండ్ "బుల్‌చీ" ఇప్పుడు నూతనంగా చెన్నయ్‌లో ఓ ఎక్స్లూజివ్ స్టోర్‌ను ప్రారంభించింది. దేశంలో ఉన్న "బుల్‌చీ" ఎక్స్లూజివ్ స్టోర్‌లలో ఇది ఆరవది కావడం విశేషం. చెన్నయ్‌లోని ఎక్స్‌ప్రెస్ అవెన్యూ మాల్‌లో అక్టోబర్ 28, 2010 గురువారం రోజున లాంఛనంగా ఈ కొత్త స్టోర్‌ను ప్రారంభించింది.

అన్ని తరాలకు సరిపోయే అత్యాధునిక ఫ్యాషనబుల్ వస్తువులను ఈ స్టోర్‌లో పొందుపరచింది. ఈ కొత్త స్టోర్‌ను అట్లాస్ బ్రాండ్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్‌బుల్‌చాందిని ప్రారంభించారు. చెన్నయ్‌లో తొలి స్టోర్‌ను ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందని, దీని వల్ల నగరంలో ఉన్న తమ వినయోగదారులకు మెరుగైన సేవలు అందిచడానికి వీలుకలిగిందని రమేష్ అన్నారు.

తమ ప్రతి ఒక్క వినియోగదారునితో దీర్ఘకాలిక సంబంధాన్ని కలిగి ఉంటామని, తమ స్టోర్‌ నుంచి ఒక్క ఉత్పత్తి కొనడంతోనే వినియోగదారులతో సంబంధాన్ని ముగించబోమనే నమ్మకాన్ని రమేష్ వ్యక్తం చేశారు. ఈ స్టోర్ ప్రారంభంతో యాక్ససరీస్ విభాగంలో బుల్‌చీ బ్రాండ్‌ నాయకత్వం మరోసారి ప్రాబల్యంలోకి రానుంది. ఎక్స్‌ప్రెస్ అవెన్యూ మాల్‌‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ స్టోర్‌ను ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి