12వ పంచవర్ష ప్రణాళిక (2012-17)ను మరింత సమ్మిళితంగా, పటిష్టంగా తయారు చేసేందుకు ప్రణాళిక సంఘం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ ప్రణాళికపై ప్రజల సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని వారు కోరారు. ఈ వెబ్‌సైట్‌లో "అప్రోచ్ పేపర్ టూ 12 ప్లాన్" (12వ ప్రణాళికకు సంబంధించి వివరణ పత్రం) ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు.
ప్రతి పంచవర్ష ప్రణాళిక వెలువరించే ముందు ప్రణాళిక సంఘం వివరణ పత్రాన్ని రూపొందిస్తుంది. ఇందులో ముఖ్య లక్ష్యాలు, కీలక పోటీ అంశాలు వంటి వాటిని సాధించేందుకు చేయాల్సిన పనులను ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఇదే క్రమంలో ఈ వివరణ పత్రం కోసం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తే మరింత మెరుగైన వివరణ పత్రాన్ని తయారు చేయవచ్చని వారు భావిస్తున్నారు.